Raza Hassan: భారత యువతిని పెళ్లాడనున్న పాకిస్థాన్ క్రికెటర్
![Pakistani cricketer Raza Hassan announces his engagement to Indian origin Pooja Boman](https://imgd.ap7am.com/thumbnail/cr-20241007tn67036530541ea.jpg)
- భారత సంతతికి చెందిన పూజా బోమన్‌తో పాక్ క్రికెటర్ హసన్ రజా వివాహం
- ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన జంట
- పెళ్లికి ముందే పూజ ఇస్లాం మతం స్వీకరిస్తారని చెప్పిన పాక్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత సంతతికి చెందిన పూజా బోమన్‌ను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో వీరి వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూజకు ఇస్లాం మతంపై ఆసక్తి ఉందని, అందుకే పెళ్లికి ముందే మతం మారాలని భావిస్తున్నట్లు రజా పేర్కొన్నారు.
కాగా, 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. పూజా బోమన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు. కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇటీవలే ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన రజా "చివరిగా మేము మా జీవితాల కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం" అంటూ తమ ఫొటోలను పంచుకున్నాడు.