Drone Delivery: గుంటూరులో మందులు చేరవేసిన డ్రోన్... వీడియో ఇదిగో!

Medicine Delivery By Drone Pilot Project In Guntur

  • జిల్లాలోని కొల్లిపర మండలంలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
  • మున్నంగి నుంచి అన్నవరపులంకకు టీకాలు, మందుల కిట్ చేరవేత
  • పది నిమిషాల్లోనే చేరుకున్న డ్రోన్

ఇటీవలి వరదలకు విజయవాడలో ఎంతోమంది ఎన్నో అవస్థలు పడ్డారు. వరదలో చిక్కుకోవడంతో కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నారు. సహాయక బృందాల వారు కూడా అక్కడికి చేరుకోలేక నిస్సహాయంగా మిగిలిపోయారు. 

అయితే, ప్రభుత్వం డ్రోన్ల ద్వారా బాధితులకు సాయం అందించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలోనే కాదు అత్యవసర పరిస్థితుల్లోనూ డ్రోన్ల సాయం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎమర్జెన్సీ మందుల చేరవేతకు డ్రోన్లను వాడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించింది. 

జిల్లాలోని కొల్లిపర మండలంలోని మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి అన్నవరపులంక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి మందులను చేర్చేందుకు అధికారులు డ్రోన్ ను ఉపయోగించారు. 10 కిలోల టీకాలు, మందుల కిట్‌ను పంపించారు. 

ఈ రెండు ఆరోగ్య కేంద్రాల మధ్య 15 కిలోమీటర్ల దూరం ఉంది. రేపల్లె కాలువ, కృష్ణా నది పరివాహక ప్రాంతాలను దాటుకుంటూ డ్రోన్ కేవలం 10 నిమిషాలలో అన్నవరపులంక ఆరోగ్య కేంద్రానికి చేరుకుంది. పీహెచ్‌సీ వైద్యాధికారిణి సీహెచ్ లక్ష్మీసుధ, తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీవో విజయలక్ష్మి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News