Sajjala Ramakrishna Reddy: ముందస్తు బెయిల్ కోసం సజ్జల పిటిషన్
![Sajjala Ramakrishna Reddy filed Bail Petition in High Court](https://imgd.ap7am.com/thumbnail/cr-20241004tn66ff4bfc36d46.jpg)
- మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు
- ఈ దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న సజ్జల
- తాను అమాయకుడిని అంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకుడిని అంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
"ఈ కేసులో సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నన్ను 120వ నిందితుడిగా చేర్చారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసు నిబంధనల ప్రకారం నేను రక్షణ పొందకుండా అడ్డుకునేందుకే హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలు, కార్యకర్తలను వేధించడం ఎక్కువైంది. అదే క్రమంలో నాపై కేసు బనాయించారు. నేను అమాయకుడిని. న్యాయస్థానం విధించే షరతులకు కట్టుబడి ఉంటాను. ముందస్తు బెయిలు మంజూరు చేయండి" అని సజ్జల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు విచారించనుంది.