Martin Guptill: వరుసగా 6,6,6,4,6,6.. రిటైర్మెంట్ తర్వాత కూడా స్టార్ బ్యాటర్ విధ్వంసం.. వీడియో ఇదిగో

Martin Guptill slammed 34 runs in an over during the Legends League Cricket 2024

  • లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో మార్టిన్ గప్టిల్ విధ్వంసం
  • ఒకే ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు బాదిన వైనం
  • 54 బంతుల్లోనే 131 పరుగులు కొట్టిన న్యూజిలాండ్ మాజీ ఆటగాడు

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మార్టిన్ గప్టిల్ రిటైర్మెంట్ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు బాదాడు. సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా కోణార్క్ సూర్యాస్ ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ తరఫున గప్టిల్ ఈ విధ్వంసం సృష్టించాడు. నవిన్ స్టీవర్ట్ వేసిన ఒక ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో ఈ మేరకు తన ప్రతాపాన్ని చూపించాడు. డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్-వికెట్‌, స్వీపర్ కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. మొదటి మూడు బంతులను సిక్సర్లు.. ఆ తర్వాత మూడు బంతుల్లో 4, 6, 6గా మలిచాడు.,

ఈ దూకుడు బ్యాటింగ్‌తో గప్టిల్ కేవలం 54 బంతుల్లోనే 131 పరుగులు సాధించాడు. దీంతో కోణార్క్ సూర్యాస్ జట్టుపై సదరన్ సూపర్ స్టార్స్ జట్టు ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ ఒడిశా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 192 పరుగుల స్కోరు సాధించింది. మార్టిన్ గప్టిల్ దూకుడుతో 193 పరుగుల లక్ష్యాన్ని సదరన్ సూపర్ స్టార్స్ జట్టు సునాయాసంగా ఛేదించింది.

  • Loading...

More Telugu News