Lokesh Kanagaraj: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్
![Director Lokesh Kanagaraj Thanks to Pawan Kalyan](https://imgd.ap7am.com/thumbnail/cr-20241003tn66fe32c9e145c.jpg)
- డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మేకింగ్ శైలి తనకు చాలా ఇష్టమన్న పవన్
- దాంతో పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
- తనను పవన్ మెచ్చుకోవడంపై ఎక్స్ వేదికగా స్పందించిన లోకేశ్ కనగరాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల తమిళ మీడియాతో మాట్లాడుతూ, తనకు తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమా మేకింగ్‌పై ఉన్న ఆసక్తిని వెల్లడించారు. పవన్ మాట్లాడుతూ.. "లోకేశ్ కనగరాజ్ మేకింగ్ శైలి నాకు చాలా ఇష్టం. నేను అతడి విక్రమ్, లియో సినిమాలు చూశాను" అని వ్యాఖ్యానించారు. దాంతో పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "పవన్ సార్ నా వర్క్‌ను ఇష్టపడ్డారని తెలిసి నా మనసు ఉప్పొంగింది. చాలా గర్వంగా ఉంది. బిగ్ థాంక్యూ" అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే హిస్టరీ క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.