Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం... పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Heavy rain in Hyderabad

  • రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారుల ఇబ్బందులు
  • చెరువును తలపిస్తున్న పంజాగుట్ట-అమీర్‌పేట రోడ్డు
  • సచివాలయం, జీడిమెట్ల సహా పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పంజాగుట్ట-అమీర్‌పేట రోడ్డు చెరువును తలపిస్తోంది.

సచివాలయం, ట్యాంక్‌బండ్, లక్డీకాపూల్, హిమయత్ నగర్, ఖైరతాబాద్, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, ప్రగతి నగర్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, బహదూర్ పల్లి, పేట్ బషీరాబాద్, కొంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, కృష్ణాపూర్, గౌడవెళ్లి, బోయినపల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, అల్వాల్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Rain
Telangana
Hyderabad
IMD
  • Loading...

More Telugu News