Ramcharan: రామ్‌చరణ్‌పై సమంత ప్రశంసలు!

Samantha praises Ram Charan

  • గేమ్‌ ఛేంజర్‌ నుంచి రెండో సాంగ్‌ విడుదల 
  • చరణ్‌ డ్యాన్స్‌కు సమంతా ఫిదా 
  • డిసెంబరులో సినిమా విడుదల

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌'. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'రా మచ్చా మచ్చా' అంటూ కొనసాగే లిరికల్‌ పాటను సోమవారం విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం రామ్‌చరణ్‌ అభిమానులను అలరిస్తోంది. తమన్‌  సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. నకాశ్‌ అజీజ్‌ ఆలపించిన ఈ పాట విజువల్స్‌ కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. 

రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 20న కిస్మస్‌ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఇదిలా వుండగా 'రా మచ్చా మచ్చా' పాటలో చరణ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌కు కథానాయిక సమంత ఫిదా అయిపోయింది. నీకెవరూ సాటిరారు.. అంటూ అన్‌మ్యాచ్‌బుల్‌ అని మెన్షన్‌ చేస్తూ... ఫార్మల్‌ ప్యాంట్‌ , షర్డ్‌తో ఇలా ఎవరైనా డ్యాన్స్‌ చేయగలరా అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. 

గతంలో రామ్‌చరణ్‌, సమంత 'రంగస్థలం' అనే బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సమంతతో పాటు రామ్‌చరణ్‌ అర్ధాంగి ఉపాసన కూడా మిస్టర్‌ సీ మీ డ్యాన్స్‌తో హై ఓల్టెజ్‌ పుట్టించారని రామ్‌చరణ్‌ చేసిన పోస్ట్‌కు స్పందించారు.

Ramcharan
Samantha
Game changer
Upasana Kamineni Konidela
  • Loading...

More Telugu News