Zakir Naik: భారత్ మోస్ట్‌వాంటెడ్ జకీర్ నాయక్‌కు పాకిస్థాన్‌లో రెడ్ కార్పెట్

Red Carpet welcome to Zakir Naik in Pakistan

  • జకీర్ నాయక్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు
  • విద్వేష ప్రసంగాలతో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టారన్న ఆరోపణలు కూడా
  • 2016లో దేశాన్ని విచిపెట్టిన మతబోధకుడు
  • అప్పటి నుంచి విదేశాల్లోనే
  • నెల రోజుపాటు పాకిస్థాన్‌లో పర్యటించనున్న జకీర్ నాయక్

భారత్ మోస్ట్ వాంటెడ్, వివాదాస్పద మతబోధకుడు డాక్టర్ జకీర్ నాయక్‌కు పాకిస్థాన్‌లో రెడ్‌కార్పెట్ ఆహ్వానం లభించింది. పాకిస్థాన్ మీడియా సంస్థ ‘డాన్’ కథనం ప్రకారం.. పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన జకీర్ నాయక్ నెల రోజులపాటు దేశంలోని ప్రముఖ నగరాలైన కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్‌లలో పర్యటించి ప్రసంగాలు ఇవ్వనున్నాడు. ఇందుకోసం అతడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రత కల్పించింది.

జకీర్ నాయక్ పాకిస్థాన్‌లో పర్యటించడం గత మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 1992లో అతడు తొలిసారి ఆ దేశాన్ని సందర్శించాడు. తాజాగా పాక్‌లో మరోమారు అడుగుపెట్టిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రత కల్పించింది. మత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు, ప్రధాని సహాయకుడు రానా మసూద్ తదితరులు ఇస్లామాబాద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. 
 
 ఇంతకీ ఎవరీ జకీర్ నాయక్? 
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ కోసం భారత అధికారులు వెతుకున్నారు. అంతేకాదు, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన కోసం పోలీసులు గాలిస్తుండడంతో 2016లో దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత అతడికి మలేసియాలో శాశ్వత నివాసం లభించింది. అతడిని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పలుమార్లు మలేసియా ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు.

  • Loading...

More Telugu News