Rare In Medical World: వైద్య చరిత్రలోనే అత్యద్భుతం.. మహిళకు రెండు గర్భాశయాలు.. రెండింటి ద్వారా కవలలకు జననం!

Chinese woman with two uteruses gives birth to twins from separate wombs

  • చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో ఘటన
  • మిలియన్ మందిలో ఒక్కరికే ఇకా అవుతుందన్న వైద్యులు
  • ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలా రెండు ఘటనలు 

ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉండడం, రెండింటి ద్వారా ఒకేసారి గర్భం దాల్చడమే కాకుండా ఒకేసారి కవలలకు జన్మనివ్వడం జరిగింది. వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ ఘటన చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లో జరిగింది. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం ప్రకారం.. మహిళకు చిన్నప్పటి నుంచే రెండు గర్భాశయాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రపంచంలో ఇలాంటి అరుదైన ఘటన 0.3 శాతం మాత్రమే ఉంటుంది. రెండు గర్భాశయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ రెండింటికి వేటికవే అండాశయాలు, అండవాహికలు కూడా ఉన్నాయి. ఇలా ఉండడం చాలా అరుదు. ఆ మహిళ సహజ పద్ధతిలోనే గర్భం దాల్చడం, రెండు గర్భాశయాల ద్వారా ఒకేసారి బాబు, పాపకు జన్మనివ్వడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. ఎనిమిదిన్నర మాసాలకే ఆమె ప్రసవించింది. 

మిలియన్ మందిలో ఒక్కరికే
మహిళకు రెండు గర్భాశయాలు ఉండడం, రెండింటితోనూ ఒకేసారి గర్భం దాల్చడం మిలియన్ మందిలో ఒక్కరికే జరుగుతుందని ఆమె ప్రసవించిన ఆసుపత్రి ప్రసూతి వైద్యురాలు తెలిపారు. సహజ పద్ధతిలో రెండు గర్భాశయాల ద్వారా గర్భం దాల్చడం ప్రపంచంలోనే అత్యంత అరుదని, ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు రెండుమాత్రమే జరిగాయని, అందులో ఇదొకటని పేర్కొన్నారు. నిజానికి ఇలా రెండు గర్భాశయాలు ఉన్న మహిళలకు ముప్పు ఎక్కువగా ఉంటుందని, గర్భస్రావం, నెలలు నిండకముందే బిడ్డలు పుట్టడంతోపాటు ఇతర సమస్యలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. గతంలో ఆమె 27 వారాల గర్భంతో ఉన్నప్పుడు గర్భస్రావం అయిందని చెప్పారు. ఈసారి మాత్రం ఈ జనవరిలో గర్భం దాల్చి విజయవంతంగా ప్రసవించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News