KTR: బావమరిదితో లీగల్ నోటీసు పంపితే మాట్లాడడం ఆపేస్తాననుకున్నావా!: కేటీఆర్

KTR comments on Chief Minister

  • బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తావా అంటూ కేటీఆర్ ఫైర్
  • ఢిల్లీలోని నీ బీజేపీ దోస్తులు నిన్ను కాపాడడం కష్టమేనంటూ ట్వీట్
  • ఆదర్శ్ స్కాంలో అశోక్ చవాన్ లాగా నువ్వు దొరికావంటూ వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు పోరాటం ఉద్ధృతం చేశారు. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. 

ముఖ్యమంత్రి తాను నిర్వహిస్తున్న శాఖలోనే తన బావమరిదికి చెందిన శోద కంపెనీకి రూ.1,137 కోట్లు కట్టబెట్టింది నిజం... అవినీతి నిరోధక చట్టంలోని 7, 11, 13 సెక్షన్లను ముఖ్యమంత్రి ఉల్లంఘించింది నిజం అని స్పష్టం చేశారు. 

"బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడడం ఆపేస్తాననుకున్నావా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోము. శోద అనే కంపెనీ గత రెండేళ్లుగా రూ.2 కోట్ల లాభం మాత్రమే ఆర్జించిన ఒక చిన్న కంపెనీ. 

ఇక, ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే. దేశంలో న్యాయ వ్యవస్థ బలంగా, నిజాయతీగా ఉంది. ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా నువ్వు దొరికావు... రాజీనామా తప్పదు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

KTR
BRS
Revanth Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News