Nani: బడ్జెట్‌ విషయంలో నో కాంప్రమైజ్‌... నిర్మాతకు నాని కండిషన్‌!

No compromise in the matter of budget Nanis condition for the producer

  • నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో సినిమా 
  • నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రమిది 
  • దసరాకు మించిన మాస్‌ అంశాలతో తాజా చిత్రం

సాధారణంగా ఓ సినిమాకు బడ్జెట్‌ అనేది హీరో, దర్శకుడి కాంబోలో ఉండే మార్కెట్‌, కథ డిమాండ్ బట్టి ఆ నిర్మాత డిసైడ్‌ చేసుకుంటారు. ఒక్కోసారి హీరో మార్కెట్‌కు మించి కూడా ఖర్చుపెడుతుంటారు. అయితే కథ డిమాండ్‌ మేరకు ఆ క్వాలిటీ తెరపై కనిపించి... సినిమా విడుదల తరువాత ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే అంతా ఓకే... లేదంటే నిర్మాత ఎక్కువ నష్టపోవాల్సి వుంటుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల మార్కెట్‌ పెరగడంతో పాటు ఆ స్థాయిలోనే ఖర్చు కూడా పెరిగింది.  

తాజాగా హీరో నాని కూడా తన సినిమాకు ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఖర్చుపెట్టండి... కథ ఎక్కువ డిమాండ్‌ చేస్తుంది అంటూ నిర్మాతను ఆదేశించాడని తెలిసింది. 

వివరాల్లోకి వెళితే... నానితో దసరా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని మరో చిత్రం చేస్తున్నాడు. నాని కెరీర్‌లో 33వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రం  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. దసరాకు మించిన మాస్‌ ఎలిమెంట్స్‌తో, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రం దసరాను మించే విధంగా ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారు. 

అయితే ఈ సినిమాకు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా, కథ డిమాండ్‌ మేరకు ఖర్చుపెట్టండి... దర్శకుడు అడిగిన ప్రతి విషయంలో సపోర్ట్‌ చేయండి అంటూ నాని నిర్మాత సుధాకర్‌ చెరుకూరికి కండిషన్‌ పెట్టాడట. సో.. నాని- శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం నాని కెరీర్‌లో భారీ బడ్జెట్‌ చిత్రంగా నిర్మాణం జరుపుకోనుంది. ప్రెజెంట్‌ ఈ నేచురల్‌ స్టార్‌ శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో హిట్‌-3లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అర్జున్‌ సర్కార్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌లో పాత్రలో నటిస్తున్నాడు.

More Telugu News