MLA Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి ముందు యువకుల రెక్కీ..?

Tensions At MLA Raja Singh House In Goshamahal

  • ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • మంగళ్ హాట్ స్టేషన్ లో విచారిస్తున్న అధికారులు
  • ఇద్దరి మొబైల్ ఫోన్లలో రాజా సింగ్, గన్, బుల్లెట్ల ఫొటోలు

హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషామహల్ లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద యువకుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువకులను అదుపులోకి తీసుకుని మంగళ్ హాట్ పోలీస్ స్టేసన్ కు తరలించారు.

ఎమ్మెల్యే ఇంటి వద్ద రెక్కీ కోసమే తిరుగుతున్నారని తేలడంతో ఎమ్మెల్యేపై దాడి చేయడానికే వచ్చారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజా అనే యువకులు రాజా సింగ్ ఇంటి దగ్గర్లో అనుమానాస్పదంగా తిరగడం చూసి స్థానికులు పట్టుకున్నారు. ఆ యువకులు ఇద్దరినీ మంగళ్ హాట్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి ఫోన్లలోనూ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫొటోలు ఉన్నాయని, వాటితో పాటు గన్, బుల్లెట్ల ఫొటోలు ఉన్నాయని చెప్పారు.

More Telugu News