Jewelery stolen: విజయవాడ వెళ్తున్న రైలులో 3.5 కేజీల బంగారు ఆభరణాల దొంగతనం

Huge gold jewelery stolen from train going to Vijayawada from Hubballi in Karnataka

  • హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శనివారం ఉదయం జరిగిన దొంగతనం
  • కేసు నమోదులో జాప్యం చేసిన రైల్వే పోలీసులు
  • సత్తెనపల్లికి చెందిన నగల వ్యాపారులకు ట్రైన్‌లో షాక్

రైల్వేశాఖ ఎన్ని భద్రతా చర్యలు చేపడుతున్నా దేశంలో ఏదో ఒక మూలన రైళ్లల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో భారీ దొంగతనం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన నగల వ్యాపారులు కాశీ విశ్వనాథ్, రంగారావులకు చెందిన మూడున్నర కేజీల బంగారు నగలను దొంగలు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.2.5 కోట్లు అని బాధితులు చెబుతున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.

కాగా బాధితులు కాశీ విశ్వనాథ్, రంగారావు ఇద్దరు అన్నదమ్ముళ్లు. వీరిద్దరూ సత్తెనపల్లిలో ‘సాయిచరణ్‌ జ్యువెలర్స్‌’ పేరుతో నగల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ నగలను తయారు చేసి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో అమ్ముతుంటారు. నగలు విక్రయించేందుకు ఇటీవలే బళ్లారి వెళ్లిన వీరిద్దరూ శుక్రవారం రాత్రి హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో తిరుగు పయనమయ్యారు. 

రంగారావు తన తల కింద నగల బ్యాగును పెట్టుకొని నిద్రపోయారు. మెలకువ వచ్చాక చూసుకోగా బ్యాగు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దొంగతనానికి గురయిందని గుర్తించారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు సమీపంలో ఉన్న దొనకొండ రైల్వే స్టేషన్‌లో దిగారు. కానీ అక్కడ రైల్వే పోలీస్ స్టేషన్ లేకపోవడంతో ఉదయం 7 గంటల సమయంలో  మార్కాపురం వెళ్లారు. నరసరావుపేట వెళ్లాలని సూచించడంతో అక్కడి వెళ్లారు. అప్పటికి సమయం 12 గంటలు అయ్యింది. 

అక్కడ కూడా రైల్వే పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులు బాగా కాలయాపన చేశారు. కేసు నమోదు చేయకుండానే ఏవేవో ప్రశ్నలు అడిగారు. దీంతో అక్కడే సాయంత్రం అయింది. చివరికు దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి పంపించారు. నంద్యాల చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు సమయం రాత్రి అయింది.

కాగా బాధితులు ఇద్దరూ సత్తెనపల్లిలో నగలను తయారు చేసి బళ్లారిలో అమ్ముతుంటారు. ఎప్పటిలాగానే మూడు రోజులక్రితం మంగళవారం రాత్రి బళ్లారి వెళ్లారు. అయితే ఆ నగలు అమ్ముడుపోలేదు. మూడు రోజులపాటు బళ్లారిలోనే ఉండి ప్రయత్నించినా వ్యాపారులు కొనుగోలు చేయలేదు. దీంతో నగలను తీసుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News