Lulu: లులూ మళ్లీ వస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు

AP CM Chandrababu welcomes Lulu

  • ఇవాళ అమరావతి విచ్చేసిన లులూ అధినేత యూసుఫ్ అలీ
  • సీఎం చంద్రబాబుతో సమావేశం
  • పలు ప్రతిపాదనలపై చర్చ

లులూ సంస్థ మళ్లీ ఏపీకి వస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యూసుఫ్ అలీకి, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రఫ్ అలీకి సాదర స్వాగతం పలుకుతున్నానని తెలిపారు. ఇవాళ లులూ అధినేత యూసుఫ్ అలీ తన బృందంతో అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగిందని చంద్రబాబు వెల్లడించారు. 

వైజాగ్ లో ఓ భారీ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్... విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించడంపై చర్చించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడంపైనా ఈ సమావేశంలో ప్రస్తావన వచ్చిందని చంద్రబాబు వివరించారు. 

లులూ సంస్థకు ఏపీ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మిత్రుడు యూసుఫ్ అలీ భవిష్యత్ లో స్థాపించబోయే ప్రాజెక్టులు అన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు సోషల్ మీడియాలో వెల్లడించారు.

Lulu
Chandrababu
Yusuf Ali
Amaravati
Andhra Pradesh
  • Loading...

More Telugu News