Sakshi Shiva: ఆయన వందల సినిమాలు చేశారు .. చివరికి మిగిలింది మాత్రం ఇవే!

Sakshi Shiva Interview

  • 550కి పైగా సినిమాలు చేసిన సాక్షి రంగారావు 
  • పెద్దగా కూడబెట్టలేదన్న తనయుడు 
  • ఆయనకి విశ్వనాథ్ గారంటే భయమని వ్యాఖ్య 
  • అప్పు చేసేవారు కాదని వెల్లడి    


నిన్నటి తరం ప్రేక్షకులకు 'సాక్షి' రంగారావు బాగా తెలుసు. కె విశ్వనాథ్ .. బాపు .. జంధ్యాల సినిమాలలో ఆయన చేసిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి 'సాక్షి' రంగారావు గురించి, తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనయుడు 'సాక్షి' శివ మాట్లాడారు. "మా నాన్నగారు చేసిన మొదటి సినిమా 'సాక్షి'. అదే ఆ తరువాత ఇంటిపేరుగా మారిపోయింది. 550 సినిమాలకి పైగా ఆయన నటించారు'' అని అన్నారు. 

"అప్పట్లో ఇండస్ట్రీలో నటన వైపు నుంచి హేమా హేమీలు ఉండేవారు. కొత్త వాళ్లకి అవకాశాలు రావడం చాలా కష్టంగా ఉండేది. డబ్బులు డిమాండ్ చేస్తే వచ్చిన వేషం పోతుందని, ఎంత ఇస్తే అంతే ఆయన తీసుకునేవారు. ఎన్ని పాత్రలు చేసినా, కొత్త పాత్ర వస్తే టెన్షన్ పడిపోయేవారు. ఇక విశ్వనాథ్ గారి సినిమా నుంచి ఛాన్స్ వస్తే, నాన్నకి జ్వరం వచ్చేసేది. ఆయనలో పిరికితనం .. భయం ఎక్కువగా ఉండేవి" అని అన్నారు.

" నాన్నగారికి అప్పు చేయడం అన్నా కూడా భయమే. ఎప్పుడైనా అవసరమైతే చంద్రమోహన్ గారిని అడిగేవారు. వచ్చిన దాంట్లోనే స్థలాలు కొనమని శోభన్ బాబుగారు చెప్పారుగానీ, నాన్నగారు పెద్దగా పట్టించుకోలేదు. ఆయన పోయే సమయానికి, చెల్లని చెక్కులు మా ఇంట్లో ఒక కట్ట కట్టి ఉండేవి. ఆయన అన్ని వందల సినిమాలు చేసినప్పటికీ, చివరికి మిగిలింది ఒక ఇల్లు .. నాలుగైదు లక్షల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే" అని చెప్పారు.

  • Loading...

More Telugu News