Chirutha Movie: చరణ్ 'చిరుత'కు 17 ఏళ్లు.. స్పెషల్ ట్వీట్ వైరల్!
![17 Years Completed to Chirutha Movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20240928tn66f790eb52cd7.jpg)
- 2007, సెప్టెంబర్ 28న వచ్చిన 'చిరుత'
- నేటితో 17 ఏళ్ల పూర్తి
- చిరుతతో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెరంగేట్రం
- పూరిజగన్నాథ్ దర్శకత్వం, వైజయంతీ ఫిల్మ్స్ నిర్మాణం
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తెరంగేట్రం చేసిన చిరుతకు 17 ఏళ్లు పూర్తయ్యాయి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఇదే రోజున (2007, సెప్టెంబర్ 28న) విడుదలైంది. దీన్ని గుర్తుచేస్తూ నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిల్మ్స్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్‌ను చెర్రీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
"17 ఏళ్ల క్రితం ఇదే రోజున గ్లోబల్ స్టార్ ఎదుగుదలను ప్రపంచం చూసింది. రామ్‌చరణ్ హీరోగా వచ్చిన తొలిచిత్రం చిరుత బాక్సాఫీస్ వద్ద తుఫానులా తీసుకువెళ్లింది. చెర్రీ అద్భుతమైన సినిమా ప్రయాణానికి వేదికగా నిలిచింది" అంటూ ట్వీట్ చేసింది.