Pakistan: ఈ పాకిస్థాన్ మారదంతే... మరోసారి భారత్ పై విషం చిమ్మిన దాయాది!

pak pm raises kashmir issue in unga address

  • ఐరాస జనరల్ అసెంబ్లీలో కశ్మీర్ అంశంపై మాట్లాడిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని వినతి
  • కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరపాలన్న షరీఫ్

దాయాది దేశం పాక్ మరోసారి భారత్ పై విషం చిమ్మింది. భారత్ పై విషం చిమ్మడం మానుకొని తమ దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని భారత్ పదే పదే చెబుతున్నా పాకిస్థాన్ లో మార్పు కనబడటం లేదు. మరో మారు ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. కశ్మీర్ విషయంలో విషం చిమ్మింది. 

ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని, కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరపాలని కామెంట్స్ చేశారు. షరీఫ్ 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలివేసి కేవలం కశ్మీర్ గురించే ఎక్కువగా మాట్లాడాడు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్చ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. 

శాంతి స్థాపన పేరుతో 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేసిన ఆర్టికల్ 370 రద్దు చర్యలను వెనక్కి తీసుకోవాలని, ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలని అన్నారు. ప్రపంచ వేదికలపై జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి భంగపాటుకు గురి కావడం పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో చర్చిస్తున్న అంశాలు, వాటి ప్రాముఖ్యతలకు సంబంధం లేకుండా భారత్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం జరిగింది.

  • Loading...

More Telugu News