Ramajogayya Sastry: నా మాటలకు విపరీతార్థాలు తీయొద్దు: లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి

Ramajogayya Sastry clarify his recent comments

  • దేవర సక్సెస్ మీట్ లో రామజోగయ్య శాస్త్రి చేసిన వ్యాఖ్యలకు ఓ నెటిజన్ సెటైర్
  • ఎక్స్ వేదికగా క్లారిఫికేషన్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి
  • సోషల్ మీడియాలో రామ జోగయ్య శాస్త్రి పోస్టు వైరల్

'నేను మాట్లాడిన మాటలకు విపరీతార్థాలు తీయవద్దు' అంటూ లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి వేడుకున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'దేవర' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి టాక్ వచ్చింది. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను తీర్చిదిద్దారని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో రామజోగయ్య శాస్త్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఓ సందర్భంలో దర్శకుడు కొరటాల శివ అన్న మాటలను రామజోగయ్య శాస్త్రి ప్రస్తావించారు. ఆ మాటలు తనకు బాగా నచ్చాయని చెబుతూ..'ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే, విజయం ఇలా ఉంటుంది. దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే విజయం మరింత బలంగా ఉంటుందని ఈ దేవర ద్వారా నిరూపితమైంది' అని రామజోగయ్య శాస్త్రి అన్నారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఎవరి పని వాళ్లని చేసుకోనిస్తే, రిజల్ట్ దేవలా ఉంటది – గురుజీ ఫైర్ .. అంటూ రామజోగయ్య శాస్త్రిని కోట్ చేశారు.

దీనిపై రామజోగయ్య శాస్త్రి వెంటనే స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రిప్లై ఇచ్చారు. 'ఓరి నాయనో..ఇది ఎటో దారితీస్తోన్నట్టుంది. నా ఉద్దేశం శివ గారు తన టెక్నీషియన్స్‌‌కి స్వేచ్చనిస్తారని..అంతే తప్ప మరొకటి కాదు. విపరీతార్ధాలు తీయవద్దని మనవి' అని జవాబు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ramajogayya Sastry
Devara
Movie News
Koratala Siva

More Telugu News