Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై కేసు నమోదు

Case against Karnataka CM Siddaramaiah
  • ముడా కేసులో సిద్ధరామయ్యపై ఆరోపణలు
  • లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి
  • సీఎంతో పాటు పలువురిపై లోకాయుక్తలో కేసు నమోదు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నేడు కేసు నమోదయింది. ఆయనపై లోకాయుక్త ఈ కేసును నమోదు చేసింది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) భూముల వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో, లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌లో సిద్ధరామయ్యను ఏ1గా పేర్కొన్నారు. నిందితుల జాబితాలో సిద్ధూతో పాటు ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్ తదితరులను కూడా చేర్చారు.

ముడా స్థలాల కేటాయింపులో సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని, ఇందుకోసం ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త ఇబ్రహీం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ స్కాం దర్యాఫ్తులో భాగంగా సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంపై సిద్ధరామయ్య హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది.
Siddaramaiah
Congress
MUDA case
BJP

More Telugu News