Ayodhya Ram Mandir: హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

Hyderabad to Ayodhya Flights from today

  • అయోధ్యతో పాటు కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభం
  • హైదరాబాద్-కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్య వారానికి నాలుగు రోజులు సర్వీసులు
  • హైదరాబాద్-ప్రయాగ్‌రాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి మూడు రోజుల సర్వీసులు

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అయోధ్యతో పాటు కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు నుంచి హైదరాబాద్-కాన్పూర్, హైదరాబాద్-అయోధ్య మధ్య వారానికి నాలుగు రోజుల పాటు సర్వీసును నడపనున్నారు.

రేపటి నుంచి హైదరాబాద్-ప్రయాగ్‌రాజ్, హైదరాబాద్-ఆగ్రా మధ్య వారానికి మూడు రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు. తెలంగాణ రాజధాని నుంచి ఒక్క నెలలోనే ఏడు విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కొత్త విమాన సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News