YS Jagan: నేడు తిరుమలకు వైఎస్ జగన్ .. పార్టీ శ్రేణులకు కీలక సూచన

ysrcp president ys jagan visit tirumala temple
  • రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్
  • తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
  • తన పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు జగన్ సూచన
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు (శనివారం) తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన శుక్రవారం (ఈరోజు) రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ .. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమల గెస్టు హౌస్ లో బస చేసి శనివారం ఉదయం 10.20 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. తదుపరి తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు.  ఈ మేరకు జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 

మరోపక్క, తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ శ్రేణులకు కీలక అదేశాలు ఇచ్చారు. తన తిరుమల పర్యటనలో ఎలాంటి హడావుడి వద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నానని జగన్ పేర్కొన్నారు.   
YS Jagan
YSRCP
TTD
Jagan Tirumala Tour

More Telugu News