Tirumala: తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు

implementation of section 30 police act across tirupati district

  • రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్ 
  • తిరుపతి జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24వరకూ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలు
  • పోలీస్ శాఖ అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎస్పీ హెచ్చరిక

తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోపక్క, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి తిరుపతికి వెళ్లనున్నారు. శనివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 

దీంతో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో వున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీ వరకూ జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ నుండి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించడానికి వీలులేదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News