Jio Recharge: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్... 98 రోజుల వ్యాలిడిటీ

Jio introduced new affordable recharge plan for its subscribers and hera details

  • రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసిన జియో
  • రోజు 2జీబీ డేటాతో 98 రోజుల వ్యాలిడిటీ ప్రకటించిన కంపెనీ
  • ఆఫర్‌లో ఆకర్షణీయమైన బెనిఫిట్స్ 

భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు నూతన రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తుంటుంది. అందులో భాగంగా ఇటీవల మరో కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. రోజుకు రూ.10 సమాన వ్యయంతో 98 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.  

ఈ ప్లాన్‌లో ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్సెమ్మెస్ లు, అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. అంతేకాదు అపరిమిత 5జీ ఇంటర్నెట్ యాక్సెస్‌ సేవను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చు.

కాగా ఎయిర్‌టెల్, వీ (వొడాఐడియా) తో పాటు రిలయన్స్ జియో కూడా జులై నెలలో టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచింది.  ఈ ప్రైవేటు టెలికం 
సంస్థలు 5 శాతం వరకు రేట్లను పెంచేశాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ రెండు విభాగాల్లోనే రేట్లను పెంచడంతో చాలా మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ ఆపరేటర్‌ అయిన బీఎస్‌ఎన్ఎల్‌ వైపు మొగ్గుచూపారు. చాలా మంది కస్టమర్లు బీఎస్ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యారు. 

అంశాలను దృష్టిలో ఉంచుకొని దిద్దిబాటు చర్యగా కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు జియో సరసమైన ఈ రూ.999 రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. మరోవైపు ఎయిర్‌టెల్ కూడా పలు కొత్త ప్లాన్లను ప్రకటించింది. అదనపు డేటా ప్లాన్ల వ్యాలిడిటీలను పెంచుతూ పలు సరమైన ఆఫర్లను ప్రకటించింది.

  • Loading...

More Telugu News