Pawan Kalyan: అన్నిటికీ మించి ఈ వ్యక్తి కూడా ఓ హిందువే: డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర ట్వీట్

Pawan Kalyan tweets on ex AAG Ponnavolu

  • తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం
  • వైసీపీ, కూటమి నేతల మధ్య మాటల యుద్ధం
  • పొన్నవోలు వ్యాఖ్యలను ఖండించిన పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారన్న అంశం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. దీనిపై మొన్న మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించగా... దానిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే ఖండించారు. అదే అంశంపై ఇవాళ పవన్ ఓ ట్వీట్ కూడా చేశారు.

ఈ ట్వీట్ లోని వీడియోలో... పొన్నవోలు వ్యాఖ్యలు, పొన్నవోలు వ్యాఖ్యలను పవన్ ఖండించడం చూడొచ్చు. 

ఇక నేటి ట్వీట్ లో పవన్ ఏమని పేర్కొన్నారంటే... వైసీపీ ప్రభుత్వంలో ఏఏజీగా పనిచేసిన వ్యక్తి తిరుమల లడ్డూపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అన్నిటికీ మించి ఈ వ్యక్తి కూడా ఓ హిందువేనని ఎత్తిపొడిచారు. ఈ విధంగా జనాలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తున్నారని పవన్ తన ట్వీట్ లో ఆవేదన వెలిబుచ్చారు.

Pawan Kalyan
Ponnavaolu
Tirumala Laddu
Janasena
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News