Alimony: భరణం కోసం వృద్ధుల గొడవ.. 'కలియుగం వచ్చేసిందేమో' అంటూ కోర్టు వ్యాఖ్య

It Seems Kalyug Has Arrived Says High Court Justice On Elderly Couples Alimony Battle

  • భర్త నుంచి మనోవర్తి కోరుతున్న 75 ఏళ్ల భార్య
  • ఫ్యామిలీ కోర్టులో భార్యకు అనుకూలంగా తీర్పు
  • హైకోర్టులో సవాల్ చేసిన 80 ఏళ్ల భర్త

భర్త నుంచి విడిపోయిన భార్యకు జీవన భృతి కోసం కోర్టులు మనోవర్తి ఇప్పిస్తుంటాయనే విషయం తెలిసిందే. విడాకులు మంజూరు చేసిన తర్వాత భార్యకు నెలనెలా ఇంతమొత్తం చెల్లించాలంటూ భర్తను ఆదేశిస్తుంటాయి. ఇప్పుడు ఇదే విషయంపై ఓ జంట కోర్టుకెక్కింది. వారిని, వారి గొడవను చూసిన న్యాయమూర్తి.. ‘కలియుగం వచ్చేసినట్టుంది’ అంటూ వ్యాఖ్యానించారు. విచారణను వాయిదా వేస్తూ తదుపరి విచారణలోగా మీలో మీరు మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోండని సూచించారు. న్యాయమూర్తి వ్యాఖ్యలకు కారణం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 

ఇంతకీ కారణమేంటంటే.. మనోవర్తి కోసం హైకోర్టు దాకా వచ్చిన ఆ జంటలో భార్య వయసు 75 ఏళ్లు కాగా భర్త వయసు 80 ఏళ్లు కావడమే! అలహాబాద్ హైకోర్టు విచారణకు వచ్చిన ఈ కేసు వివరాలు..

అలీగఢ్ కు చెందిన మునేశ్ కుమార్ గుప్త (80) తన భార్య నుంచి విడాకులు పొందారు. ఈ సందర్భంగా మనోవర్తి కావాలంటూ గుప్త భార్య కోరగా.. ఫ్యామిలీ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పును గుప్త అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం ఈ కేసు విచారణకు హాజరైన గుప్త, ఆయన భార్యను చూసి జస్టిస్ సౌరభ్ శ్యామ్ శంషేరి ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఇదేం గొడవ అని మందలిస్తూ.. ఇద్దరూ కూర్చుని సామరస్యపూర్వకంగా ఒప్పందానికి రావాలని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News