Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం... రోడ్లపై నిలిచిన నీరు
- చైతన్యపురి కమలానగర్‌లో మోకాళ్ల లోతు వరకు నిలిచిన నీరు
- విజయవాడ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్
- తార్నాక, అబిడ్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. దీంతో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
చైతన్యపురి కమలానగర్‌లో మోకాళ్ల లోతు వరకు నీరు వచ్చింది. నీళ్లు రహదారిపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. విజయవాడ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట, ముషీరాబాద్, చంపాపేట, సైదాబాద్, సరూర్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్ బాగ్, హిమయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, బోయినపల్లి, అల్వాల్, చిలకలగూడ, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, బహుదూర్‌పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట, గోల్కొండ, లంగర్‌హౌజ్, కార్వాన్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.