TS High Court: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

High Court orders to Government on FTL

  • బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్న హైకోర్టు
  • వారంలోపు అభ్యంతరాలు చెప్పాలని బాధితులకు సూచన
  • ఆరు వారాల్లోగా ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలన్న హైకోర్టు

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణ శాస్త్రీయంగా జరగలేదని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా... బాధితుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వారంలోపు చెరువుల పరిరక్షణ కమిటీ ముందు హాజరై అభ్యంతరాలను చెప్పాలని బాధితులకు కూడా సూచించింది. ఆరు వారాల్లోగా ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ క్రమంలో, ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని జీహెచ్ఎంసీ తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో 65 ఎకరాలు మాత్రమే ఉందని, అధికారులు మాత్రం 160 ఎకరాలు అంటున్నారని, ఇది సరైనది కాదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News