HYDRA: కావూరీహిల్స్ పార్క్ లోని స్పోర్ట్స్ అకాడమీని తొలగించిన హైడ్రా

Hydra Bulldozers Demolish Unauthorised Structures In Kavuri Hills Hyderabad

  • కావూరీహిల్స్ పార్క్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • అసోసియేషన్ నుంచి లీజుకు తీసుకున్నామని అకాడమీ నిర్వాహకుల వివరణ
  • కోర్టు ఆదేశాలతోనే తొలగించామన్న హైడ్రా చీఫ్ రంగనాథ్ 

హైదరాబాదులో ప్రభుత్వ భూములు, చెరువులు కుంటలలో ఆక్రమణలను తొలగించే పనిలో హైడ్రా దూసుకుపోతోంది. అక్రమార్కులకు సింహస్వప్నంగా మారింది. భారీ నిర్మాణాలను, ఖరీదైన విల్లాల విషయంలోనూ వెనుకడుగు వేయడంలేదు. తాజాగా సోమవారం ఉదయం మాదాపూర్ లో హైడ్రా బుల్డోజర్లు తొలగింపులు చేపట్టాయి. కావూరీహిల్స్ లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నాయి. స్థానిక పార్కులో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. కొంతకాలంగా ఈ అకాడమీపై కావూరిహిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తుండడంతో తాజాగా రంగంలోకి దిగిన హైడ్రా.. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగించింది.

కావూరీహిల్స్ పార్క్ అంటూ అధికారులు అక్కడ బోర్డు ఏర్పాటు చేశారు. అయితే, కావూరీహిల్స్ అసోసియేషన్ నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకుని స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. 25 ఏళ్లకు లీజుకు తీసుకున్నామని, ఆ గడువు పూర్తికాకముందే తొలగిస్తున్నారని ఆరోపించారు. అయితే, కోర్టు ఆదేశాలతోనే కావూరీహిల్స్ పార్క్ లో ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News