Chandrayaan-3: చందమామపై బయటపడ్డ భారీ బిలం.. ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలో గుర్తింపు

Pragyan Rover Discovers 160 Km Wide Crater On Moons Surface

  • ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు ఉందంటున్న సైంటిస్టులు
  • చంద్రయాన్ 3 దిగిన చోటుకు దగ్గర్లో గుర్తించినట్లు వెల్లడి
  • అహ్మదాబాద్ కు చెందిన సైన్స్ డైరెక్ట్ మేగజైన్ లో ప్రచురణ

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను దింపిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ తో పాటు ప్రగ్యాన్ రోవర్ ను ఇస్రో చంద్రుడిపైకి పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తర్వాత ప్రగ్యాన్ రోవర్ అక్కడి పరిస్థితిని ఫొటోలు తీసి పంపించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి కొద్దిదూరం పాటు ప్రయాణించి చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్స్ ప్లోర్ చేసింది. ఈ క్రమంలోనే అక్కడ భారీ బిలంను గుర్తించింది. ల్యాండ్ అయిన ప్రదేశాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ప్రగ్యాన్ రోవర్ ఫొటోలు తీసి విక్రమ్ ల్యాండర్ కు పంపగా.. విక్రమ్ వాటిని ఇస్రోకు చేరవేసింది.

ఇలా అందుకున్న ఫొటోలను ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ బిలంను గుర్తించారు. దాదాపు 160 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ బిలం చాలాకాలం కిందటే ఏర్పడిందని వారు అంచనా వేస్తున్నారు. సాధారణంగా అగ్ని పర్వతం బద్దలైనపుడు ఇలాంటి బిలాలు ఏర్పడతాయని చెప్పారు.  చంద్రుడి సౌత్ పోల్ కు సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఈ బిలం ఉందని వివరించారు. కాగా, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండైన విక్రమ్, అందులో పంపిన ప్రగ్యాన్ రోవర్ ప్రస్తుతం స్లీపింగ్ మోడ్ లో ఉన్నాయి.

అక్కడ రాత్రి సమయం దాదాపు మనకు పద్నాలుగు రోజులు.. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ కు పడిపోతాయని, ఆ ఉష్ణోగ్రతలో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు పనిచేయలేవని సైంటిస్టులు వివరించారు. వాటి బ్యాటరీలు పూర్తిగా డ్రై అయిపోయాయని వివరించారు. ప్రస్తుతం అవి రెండూ చంద్రుడిపై నిద్రిస్తున్నాయని సైంటిస్టులు చెప్పారు.

  • Loading...

More Telugu News