Balakrishna: అభిమాని గృహప్రవేశానికి వెళ్లి.. మూడు గంటల సేపు గడిపిన బాలకృష్ణ

Balakrishna attends his fans gruhapravesham
  • అభిమాని కోరిక తీర్చిన బాలకృష్ణ
  • దంపతులను ఆశీర్వదించి.. అక్కడే భోజనం చేసిన బాలయ్య
  • అందరితో సరదాగా గడిపిన నటసింహం
అభిమానులను బాలకృష్ణ అమితంగా ప్రేమిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన తన అభిమానులపై ఉండే ప్రేమను చాటుకున్నారు. తమ గృహప్రవేశ వేడుకకు బాలయ్యను ఒక అభిమాని ఆహ్వానించారు. అభిమాని కోరిక మేరకు బాలయ్య బిజీ షెడ్యూల్ లో సైతం ఆయన గృహప్రవేశానికి వెళ్లారు. గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని... దంపుతులను ఆశీర్వదించారు. అక్కడే భోజనాలు కూడా చేశారు. 

దాదాపు మూడు గంటల సేపు బాలయ్య అక్కడ ఉన్నారు. అక్కడున్న అందరితో సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులతో ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య తమ ఇంటికి రావడంపై ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంత మంచి మనసున్న వ్యక్తిని తాము తమ జీవితంలో చూడలేదని వారు చెప్పారు.
Balakrishna
Tollywood
Telugudesam
Fan

More Telugu News