Tara Master: నాగార్జున, రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తారా మాస్టర్

Tara Master talks about Nagarjuna and Ram Charan

  • లేడీ డైనమిక్ కొరియోగ్రాఫర్ గా పేరొందిన తారా మాస్టర్..
  • ఒకప్పటి స్టార్ హీరోల నుండి ఇప్పటి హీరోల వరకు స్టెప్పులేయించిన వైనం..
  • 100 కోట్ల ఆస్తి నుండి ఇంటి అద్దె కూడ కట్టలేని స్థితి 

డాన్స్ కోసమే సినిమాలకు వెళ్లేవారు చాలామంది ఉంటారు. హీరో వేసే స్టెప్స్ వెనుక కొరియోగ్రాఫర్ డాన్స్, మాస్టర్ల కృషి ఎంతో ఉంటుంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ గా మగవారు మాత్రమే హీరో హీరోయిన్స్ తో స్టెప్పులు వేయించగలరని అనుకునే టైంలో లేడీ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమంది హీరోలతో హీరోయిన్స్ తో స్టెప్పులు వేయించి మూడు తరాల హీరోలతో పని చేసిన డైనమిక్ కొరియోగ్రాఫర్ గా తారా మాస్టర్ ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు.

చిరంజీవి బాలకృష్ణ, వెంకటేష్,నాగార్జున,ఇప్పటి హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వరకు ఆమె అందరితో కలిసి పనిచేశారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ విషయాలు మీ కోసం..

తారా మాస్టర్ తో యాంకర్ మీరు ఇలా ఎలా మారిపోయారు. మీరు చాలా బాగుండేవారు కదా ఇప్పుడు ఇలా ఓల్డ్ లుక్ లో కనిపించడానికి కారణం ఏంటి అని అడిగితే.. తారా మాస్టర్ నవ్వుతూ " నేను వెయిట్ తగ్గాను. ఎవరైనా నా గురించి మాట్లాడుకునేటప్పుడు.. నేను కొంచెం ఫీల్ అవుతాను. ఆ ఫీలింగ్స్ అంతే కానీ, నేను చాలా ఆరోగ్యంగా అయితే ఉన్నాను. నాకు నేనే నేనెలా ఉన్నా పర్వాలేదు అని అనుకొనే ఇలా మారిపోయాను. ఒకప్పుడు హెయిర్ కి డై వేసుకోవడం వల్ల మీకు యంగ్ గా కనిపించి ఉంటాను. ఇప్పుడు అలాంటిదేం లేదు. ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నాను. అంతేగాని నేనేం పెద్దగా మారలేదు" అని తెలిపారు.

యాంకర్ మీరు మీ హీరోలతో ఇప్పుడు మాట్లాడడానికి ట్రై చేశారా అని అడిగితే తార మాస్టర్ మాట్లాడుతూ.. " లేదు నేనెప్పుడూ వారితో మాట్లాడాలని ట్రై చేసినా, వారు వేరే ఊర్లలో ఉన్నప్పుడే ట్రై చేస్తూ ఉంటాను. వారు ఇండియాలో లేనప్పుడు నాకు తెలియదు కదా. చిరంజీవి గారితో నేను సినిమాలు తీసేటప్పుడు రామ్ చరణ్ చాలా చిన్నవాడు. మేమంతా కలిసి సింగపూర్, ఇతర విదేశాల్లో షూటింగ్స్ కి వెళ్లే వాళ్ళం. అప్పుడు రామ్ చరణ్ కూడా అక్కడికి వచ్చేవారు. చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చేవారు. రామ్ చరణ్ ను నా ఒళ్లోకూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెబుతూ ఉండేదాన్ని.. ఇప్పుడు వాళ్లంతా పెద్దవాళ్ళు అయిపోయారు. మంచి హీరోస్ గా ఎదిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.

 "నేను నాగేశ్వరరావు గారి తో పనిచేశాను. నాగార్జున గారికి 10 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నుంచి నాకు తెలుసు. నాగేశ్వరావు గారితో పాటు సినిమా షూటింగ్స్ కి వచ్చేవారు. వారి పిల్లలందరినీకి తీసుకొని నాగేశ్వరావు గారు షూటింగ్ కి వచ్చేవారు. అన్నపూర్ణమ్మ గారు కూడా అక్కడే ఉండేవారు. పిల్లలందరినీ ఆవిడే చూసుకునేవారు. అప్పట్లో నేను తంగప్పన్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఉండేదాన్ని. అప్పట్లో అసిస్టెంట్స్ కూడా రూమ్ ఇచ్చేవారు. 

అప్పుడు నాగార్జున  మాత్రం నా దగ్గరికి వచ్చి నైట్  దాకా నా గదిలోనే ఉండేవాడు. అప్పుడు చాలా చిన్నవాడు నన్ను కథ చెప్పమని అడిగేవాడు. నేనేదో ఒక కథలు చెబుతూ ఉండేదాన్ని, ఇక వాళ్ళ అమ్మ అన్నపూర్ణ గారు వచ్చి ఇప్పటికే చాలా ఆలస్యమైంది పడుకుందాం అని తీసుకొని వెళ్లేవారు. పెద్ద పెద్ద కళ్ళతో ఉండే నాగార్జున... నేను చెప్పే కథలను నిజం అనకుని వింటూ ఉండేవాడు. నాగార్జున గారితో కూడా పనిచేసే అవకాశం నాకు వచ్చింది. కానీ వాళ్ళ అబ్బాయి నాగచైతన్య తో పనిచేసే అవకాశం నాకు రాలేదు. ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను కొరియోగ్రాఫర్ గా కంటిన్యూ అవుతున్నాను. కానీ ఆయనతో చేసే అవకాశం అయితే కుదరలేదు" అని తారా తెలిపారు.

 యాంకర్ మీరు ఈ వయసులో కష్టాన్ని ఎలా తట్టుకోగలుగుతున్నారు అని అడిగిన ప్రశ్నకు... "దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. 74 సంవత్సరాలు వచ్చాయి. ఇక ఇవాళ ఏంటి రేపు ఏంటి అన్నది కూడా తెలియదు. ఇప్పటివరకు మంచిదారిలోనే వచ్చాను. సంతోషంగానే ఉన్నాను. ఇప్పటివరకు నేను దేనికి బాధపడలేదు కానీ సొంత ఇల్లు లేదని ఎప్పుడూ నాకు ఆ బాధ ఉంటుంది" అని ఎమోషనల్ అయ్యారు.

మీరు అప్పట్లో సుందరం మాస్టర్ గురించి కోర్టులో ఫైట్ చేశారు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆ ప్రశ్నలకు ఇప్పుడు నేను సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించానో కూడా తెలియలేదు. తొమ్మిది సంవత్సరాల అజ్ఞాతంలో ఉండి ఇప్పుడే బయటికి వచ్చాను. ఇప్పటికీ నేను కొరియోగ్రఫీ చేయగలను. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏదైనా అవకాశం వస్తే  నేను మళ్ళీ డాన్స్ మాస్టర్ గా రీ ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నా" అని ఇంటర్వ్యూ ని ముగించారు.

  • Loading...

More Telugu News