Bhanuchandar: భానుచందర్ ఇప్పటికీ యంగ్ గా కనిపించడానికి కారణం ఇదే!

Bhanuchandar health secret

  • అలనాటి నటుడు భానుచందర్ హెల్త్ సీక్రెట్ 
  • ఆరోగ్యమే ప్రధానమని చెప్పిన భానుచందర్ 
  • ప్రత్యేకంగా ఆడవారి అందం కోసం చెప్పిన టిప్స్..

భానుచందర్ ఒకప్పటి యాక్షన్ హీరో. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చే ప్రతి సినిమాలో ఆయన కోసం ఒక క్యారెక్టర్ ఉండేది. భానుచందర్ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యమని తరచూ చెబుతూ ఉంటారు. ఎప్పుడు యంగ్ గా ఉండడానికి మనం మన మనసుతో పాటు శరీరం కూడా దృఢంగా ఉంచుకోవాలన్నది ఆయన మాట. అప్పటి నుండి ఇప్పటి వరకు తన ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలను భానుచందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిమానులతో పంచుకున్నారు.

భానుచందర్ ను యాంకర్ మీకు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది కదా, ఇప్పటికి ఆ ఫాలోయింగ్ అలానే ఉందా అని అడిగితే భానుచందర్ మాట్లాడుతూ "ఇప్పటికీ చాలామంది  నాకు ఫోన్ చేసి మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? అని అడుగుతూ ఉంటారు. వారిలో ఆడవారు కూడా ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది మగవారికి బలం ఉంటే సరిపోతుంది. కానీ ఆడవారికి బలంతో పాటు అందం కూడా ఉండాలి. ఆడవారు ఎక్కువగా వారి ఫేస్ మీదే శ్రద్ధ వహిస్తారు. ఫేస్ తో పాటు బాడీ మొత్తం ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకోవాలి. బాడీ జాగ్రత్తగా చూసుకోగలిగితే వందేళ్ల పాటు సులభంగా ప్రయాణం చేయొచ్చు. ఈ రోజుల్లో ఆడవారందరూ అవేర్ నెస్ తో ఉంటున్నారు. వారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా మెయింటినెన్స్ చేస్తున్నారు" అని తెలిపారు.

జీవితం చాలా చిన్నదని. హ్యాపీగా నిద్రలోనే ఎటువంటి కష్టాలు పడకుండా తన ఫ్రెండ్ ప్రతాప్ చనిపోయినట్లుగా చనిపోవాలని, ఎప్పుడు అదొక్కటే నా కోరికగా ఉంటుందని భానుచందర్ తెలిపారు.

యాంకర్ మీరు ఈ వయసులో కూడా మీరు ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు అని అడిగితే భానుచందర్ నవ్వుతూ..  "100% ఆకలిగా ఉన్నప్పుడు మనం 60% మాత్రమే ఆహారాన్ని ఇవ్వాలి. మిగిలిన 40% ఖాళీగా ఉంచాలి. ఈ విషయం నేను హీరో నాగేశ్వరావు గారి నుండి నేర్చుకున్నాను. ఉదయం నిద్ర లేవగానే తేనె వాటర్ తాగడం, గ్రీన్ గ్రామ్స్ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం, రోజు ఒక పండు కచ్చితంగా తింటాను. ఉదయం లేదా నైట్ భోజనంలో బొప్పాయి పండుని కచ్చితంగా తీసుకుంటాను. అందరికీ ఎలా పడుతుందో నాకు తెలియదు. నా శరీరానికి అయితే బొప్పాయి పండు సెట్ అయింది. రోజు నా అల్పాహారంలో ఉదయం ఓట్స్ ను తీసుకుంటాను" అని తెలిపారు. 

 మీరు డ్రింక్ చేస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. "నేను తక్కువగా డ్రింక్ చేస్తాను. అలాంటి వాటికి దూరంగా ఉండమని నేను చెప్పను కానీ, అన్ని లిమిట్ గా తీసుకోవాలి. అది కూడా టైంకి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని నా అభిప్రాయం. బాగా సంతోషం వేసినప్పుడు  ఓ గ్లాస్ తాగుతాను. అలాగని దానికి ఎడిట్ అవ్వకూడదు. బాధలో ఉన్నప్పుడు డ్రింక్ చేయడం అన్నది చాలా పెద్ద పొరపాటు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇలాంటి ఇంటర్వ్యూల ద్వారా నలుగురికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని భానుచందర్ ఇంటర్వ్యూ ని ముగించారు.

  • Loading...

More Telugu News