Viral News: ఆహారంలో బతికివున్న ఎలుక.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

a passenger discovered a live mouse in their in flight meal and plane make an emergency landing

  • ఫుడ్ పార్శిల్ నుంచి బయటకొచ్చిన ఎలుక
  • అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన విమాన సిబ్బంది
  • ఎలుకలు విద్యుత్ వైర్లను కొరికే ప్రమాదం... అందుకే ప్రత్యేక ప్రోటోకాల్

విమాన ప్రయాణంలో ఓ ప్యాసింజర్ బాగా ఆకలి వేయడంతో ఫుడ్ పార్శిల్‌ను ఓపెన్ చేసి ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంది. ఆమె అలా పార్శిల్‌ తెరవగానే ఫుడ్ ప్యాక్ నుంచి బతికి ఉన్న ఎలుక ఒకటి బయటకు దూకింది. దీంతో ప్రయాణికురాలు షాక్ అయింది. విషయాన్ని ఫ్లైట్ సిబ్బందికి తెలియజేయగా... వారు ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

బుధవారం నాడు స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఏఎస్) చెందిన ఓ ఫ్లైట్ నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మలాగాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. విమానాన్ని డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో అత్యవసరంగా కిందికి దించారు. 

విమానంలో ఎలుకలు కనిపించినప్పుడు అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తారని స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి ఓస్టెయిన్ చెప్పారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు నిబంధలను కచ్చితంగా పాటిస్తామని అన్నారు. 

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై విమానాన్ని తయారు చేసిన కంపెనీతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. విమానంలోని విద్యుత్ వైర్లను కొరికివేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రయాణం మధ్యలో ఎలుకలు కనిపించినప్పుడు ఈ ప్రొటోకాల్‌ పాటిస్తారని బీబీసీ కథనం పేర్కొంది.

కాగా విమానాన్ని కోపెన్‌హాగన్‌లో ల్యాండింగ్ చేసిన వెంటనే ఎలుకను పట్టుకునేందుకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ ఘటనపై విమానంలో ప్రయాణించిన జార్లే బోర్రెస్టాడ్ అనే ప్యాసింజర్ ఫేస్‌బుక్ వేదికగా స్పందించాడు. 

‘‘ మీరు నమ్మండి లేదా నమ్మకపోండి. స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో నా పక్కన ఉన్న ఒక మహిళ ఫుడ్ పార్శిల్ ఓపెన్ చేయగానే అందులోంచి ఒక ఎలుక బయటకు దూకింది. విమానం మారేందుకు కోపెన్‌హాగన్ విమానాశ్రయంలో దిగాము’’ అని చెప్పారు. ఎలుక తన ప్యాంట్‌లోకి దూరకుండా జాగ్రత్త పడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఇంత జరిగినా విమానంలో ఎవరూ నోరు తెరవలేదని, అందరూ నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారని ఆయన చెప్పారు.

ని
  • Loading...

More Telugu News