Komatireddy Venkat Reddy: కేసీఆర్ వద్దంటున్న ప్రతిపక్ష నేత హోదా హరీశ్ రావుకు దక్కుతుందేమోనని కేటీఆర్ భయం: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy slams KTR over Amrut tenders issue

  • విపక్ష నేత హోదా కోసం కేటీఆర్, హరీశ్ పోటీపడుతున్నారన్న కోమటిరెడ్డి
  • కేటీఆర్ కుటుంబ గొడవలతో ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని ఎద్దేవా
  • కేటీఆర్ చిన్న పిల్లాడేం కాదని, ఆలోచించి మాట్లాడాలని హెచ్చరిక
  • అమృత్ టెండర్ల విషయంలో ఆధారాలు ఉంటే ఇవ్వాలని సవాల్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై ధ్వజమెత్తారు. కేసీఆర్ వద్దంటున్న ప్రతిపక్ష నేత హోదా హరీశ్ రావుకు దక్కుతుందేమోనని కేటీఆర్ భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఆ పదవి కోసం కేటీఆర్ కూడా పోటీ పడుతున్నారని వివరించారు. కుటుంబ గొడవలతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నారని ఎద్దేవా చేశారు. 

అసలు, కేటీఆర్ దోపిడీ వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అప్రదిష్ఠపాల్జేసిన సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ కు రైట్ హ్యాండ్ అని ఆరోపించారు. 

కేటీఆర్ చిన్న పిల్లాడేం కాదని, ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. అమృత్ టెండర్లకు సంబంధించి రూ.8,888 కోట్లు మంజూరు అయినట్టు కేటీఆర్ వద్ద ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే, తన బినామీ అయిన సత్యం రామలింగరాజు కుమారుడికి చెందిన ఓ సంస్థకు కేటీఆర్ టెండర్లు ఇచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. 

గత పదేళ్లలో కవిత ఏం చేసిందో బయటపెడతామని అన్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాష్ట్రానికి వచ్చి అప్రూవర్ గా మారితే కేటీఆర్, హరీశ్ రావు కచ్చితంగా జైలుకు వెళతారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అందుకే, కేటీఆర్, హరీశ్ రావు అమెరికా వెళ్లి రాష్ట్రానికి రావొద్దని ప్రభాకర్ రావుకు చెప్పి వచ్చారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News