Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

TTD Ready To Establish Lab For Checking Ghee

  • ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్‌ ల్యాబ్‌లో ఇటీవల లడ్డు శాంపిల్స్ పరీక్ష
  • అదే సంస్థతో నాణ్యతను పరిశీలించే మిషన్ల కోసం ఒప్పందం
  • డిసెంబర్ నాటికి తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు

తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాజా వివాదం నేపథ్యంలో ప్రముఖ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని ఇటీవల నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు.. సెంటర్ ఫర్ అనలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ (ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్) ల్యాబ్‌కు పంపింది.

ఈ సందర్భంగా వారితో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. నెయ్యిలో నాణ్యతను పరీక్షించే రూ. 75 లక్షల విలువైన పరికరాలు ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ సిద్ధమైంది. వీటిని దిగుమతి చేసుకున్న అనంతరం టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 2015-16లో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దానిని పట్టించుకునేవారు లేకపోవడంతో అది కాస్తా మరుగున పడింది. రిటైర్డ్ ఉద్యోగి ఒకరు నాణ్యత పరీక్షలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

Tirumala Laddu Row
TTD
NDDB CALF
  • Loading...

More Telugu News