TS High Court: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Petition on Durgam Cheruvu FTL limit

  • దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్
  • గత రికార్డుల ప్రకారం 65 ఎకరాలుగా ఉందని పిటిషన్
  • విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో సీజే ధర్మాసనం విచారణను చేపట్టింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రికార్డుల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధి 65 ఎకరాలుగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని రెవెన్యూ, నీటి పారుదల శాఖ, హెచ్ఎండీఏకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్ నగర పరిధిలోని వివిధ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది. ఈ క్రమంలో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • Loading...

More Telugu News