Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్... 1,359 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

Sensex crosses 84K mark

  • తొలిసారి 84 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్
  • 84,544 పాయింట్లకు పెరిగిన సెన్సెక్స్
  • 25,790కి చేరుకున్న నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అమెరికా ఫెడ్ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో సూచీలు జీవనకాల గరిష్ఠాలను అధిగమించాయి. సెన్సెక్స్ తొలిసారి 84 వేల మార్కును అందుకుంది. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,359 పాయింట్లు పెరిగి 84,544కు చేరుకుంది. నిఫ్టీ 375 పాయింట్లు లాభపడి 25,790 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.77%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (3.66%), ఎల్ అండ్ టీ (3.07%), భారతి ఎయిర్ టెల్ (2.84%).

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.33%), టీసీఎస్ (-0.27%), బజాజ్ ఫైనాన్స్ (-0.07%).

Sensex
Nifty
Stock Market
  • Loading...

More Telugu News