Israel: హిజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని టార్గెట్లపై రాకెట్ల వర్షం

Israel strikes on Hezbollah targets in Lebanon

  • యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి తమ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
  • రక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచన
  • హెజ్బొల్లా నేత హెచ్చరికలు చేసిన మరుక్షణంలోనే విరుచుకుపడిన ఇజ్రాయెల్
  • 150 లాంచర్ బ్యారెల్స్, ఆయుధాగారాలు, మౌలిక సదుపాయాలపై రాకెట్ల వర్షం

హిజ్బొల్లా లక్ష్యంగా గురువారం ఇజ్రాయెల్ మిలటరీ రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఏడాది ఇంత తీవ్రంగా దాడిచేయడం ఇదే తొలిసారి. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బొల్లాకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 150 లాంచర్ బ్యారెల్స్, మిలటరీ మౌలిక సదుపాయాలు, భవనాలు, ఆయుధ గోడౌన్లను నాశనం చేసింది.

ఇజ్రాయెల్ దాడిలో పెద్ద లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలు పెద్ద ఎత్తున తగలబడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తొలిసారి దక్షిణ ఇజ్రాయెల్‌ వాసులకు ఆంక్షలు జారీచేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, రక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది.

హిజ్బొల్లా పేజర్లు, వాకీటాకీలు పేలిన నేపథ్యంలో ప్రతికారం తప్పదని హిజ్బొల్లానేత హసన్ నస్రుల్లా హెచ్చరికలు జారీచేసిన వెంటనే ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News