Tiger: తాళం పగలగొట్టుకుని బోను నుంచి బయటకు వచ్చిన పులి.. ఒళ్లు జలదరించే వీడియో ఇదిగో!

Viral Video Tiger Breaks Cage Lock And Comes Out
  • బోను లోపల ఉన్న పులి బయటకు వచ్చే ప్రయత్నం
  • తాళంకప్పను నోట్లో పెట్టుకుని దానిని బలంగా లాగిన పులి
  • బోను తలుపును కాలితో లాగి చూసిన వైనం 
బోనులో బందీగా ఉన్న పులి తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఇప్పటికే 1.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాళం కప్పను నోటితో పట్టుకుని లాగుతూ దానిని పగలగొట్టేందుకు పులి ప్రయత్నించింది. ఆ తర్వాత కాలితో బోను తలుపును లాగేందుకు ప్రయత్నించింది. రాకపోవడంతో మరోమారు తాళంకప్పను నోటితో పట్టుకుని బలంగా లాగింది. ఆ తర్వాత తలుపు తీసుకుని దర్జాగా బయటకు వచ్చింది. అయితే, ఆ కప్పను పులే తనంత తానుగా బద్దలుగొట్టి బయటకు వచ్చిందా? లేక ఎవరైనా సాయం చేశారా? అన్న విషయంలో స్పష్టత లేదు.

ఈ వీడియోపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. పులికి ఉన్న శక్తిని చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తోందని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. ప్రకృతిలో ఇంత బలముందా? అని ఇంకో యూజర్ ఆశ్చర్యపోయాడు. పులులు ఎంత భయంకరమైనవో మరోమారు తెలిసి వచ్చిందని ఇంకో యూజర్ రాసుకొచ్చాడు. పులి బోనులో ఉంది కదా.. అని ఇకపై నిశ్చింతగా ఉండడానికి వీల్లేదని మరో వ్యక్తి భయం వ్యక్తం చేశాడు. అసలు పులులను ఇలా చిన్న బోనులలో ఉంచాలనుకోవడమే మూర్ఖత్వమని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో చూస్తే మీరేమంటారో?
Tiger
Tiger Cage
Instagram Video
Viral Videos

More Telugu News