Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు... కొనసాగుతున్న తొలి విడత పోలింగ్

First phase polling of Jammu and Kashmir assembly elections continues

  • జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు
  • నేడు తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.17 శాతం పోలింగ్

భారత్ లో అత్యంత సమస్యాత్మక ప్రాంతం జమ్మూకశ్మీర్ లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

కశ్మీర్ లోయలో ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.17 శాతం పోలింగ్ నమోదైంది. 

జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా... తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  

సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరగనుంది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News