Anil Ambani: అనిల్ అంబానీ కంపెనీ షేర్లకు రెక్కలు.. రూ. లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు!

 Anil Ambani hit the jackpot got an order of 500 MW started talking to Share Hawa turned Rs 1 lakh into Rs 27 lakh

  • రిలయన్స్ పవర్‌కు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు
  • నాలుగున్నరేళ్ల క్రితం షేర్ ధర రూ. రూ.1.13 మాత్రమే
  • అప్పర్ సర్క్యూట్‌ను తాకిన షేర్ ధర

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ జాక్‌పాట్ కొట్టారు. ఆయన కంపెనీ రిలయన్స్ పవర్‌ కు అతిపెద్ద ఆర్డర్ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ-రివర్స్ ఆక్షన్ ద్వారా 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు లభించినట్టు రిలయన్స్ పవర్ ప్రకటించింది. ఆ ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. రిలయన్స్ పవర్ షేర్లు పైకి ఎగబాకాయి. సోమవారం రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఆ రోజు రిలయన్స్ పవర్ షేర్ రూ. 30.30 వద్ద ప్రారంభమైంది. ఆర్డర్ అందుకున్న తర్వాత 31.32 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే 31.51 రూపాయలకు చేరుకుంది. 

ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ షేర్లు గత నాలుగున్నర సంవత్సరాలలో 2671 శాతం రాబడినిచ్చాయి. 27 మార్చి 2020న రిలయన్స్ పవర్ షేర్లు రూ.1.13కి చేరాయి. నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఒక్కో షేరు రూ.31.32కి చేరింది. అంటే అప్పట్లో ఈ షేర్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈరోజు రూ.27.71 లక్షలు సొంతం చేసుకోబోతున్నట్టే. జాక్‌పాట్ అంటే ఇదే కదా!

  • Loading...

More Telugu News