AP Devotees: బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ భక్తులు సురక్షితం

AP devotees who headed for Badrinath are safe

  • బద్రీనాథ్ యాత్రకు బయల్దేరిన ఏపీ భక్తులు
  • గోచార రుద్రప్రయాగ వద్ద విరిగిపడిన కొండచరియలు
  • ఏపీ యాత్రికులకు ఇబ్బందులు

బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన ఏపీ యాత్రికులు కొండచరియలు విరిగిపడిన కారణంగా ఇబ్బందులపాలయ్యారు. అయితే, ఏపీ యాత్రికులు సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. 

యాత్రికులతో మాట్లాడిన అనిత వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో యాత్రికులను సమన్వయం చేశారు. ఏపీ యాత్రికులు రుద్రప్రయాగ చేరుకున్నట్టు అధికారులు హోంమంత్రి అనితకు తెలిపారు. కాగా, రుద్రప్రయాగ నుంచి తమ స్వస్థలాలకు వెళుతున్నట్టు యాత్రికులు వెల్లడించారు. 

నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో అధికారులు బద్రీనాథ్ వెళ్లే మార్గం మూసేశారు. దాంతో ఏపీ యాత్రికులు నిన్నటి నుంచి గోచార రుద్రప్రయాగ వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తాడిపత్రికి చెందిన 40 మంది భక్తులు రోడ్డుపైనే పడిగాపులు కాశారు. ఈ విషయాన్ని భక్తులు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన అధికారులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News