Bill Gates: భారత్‌ నిజాయతీ ఆకట్టుకుంది... బిల్‌గేట్స్ ప్రశంసలు

Bill Gates has give India A rating for its focus on solving the problem of malnutrition

  • పోషకాహార లోపం సమస్య పరిష్కారంలో మెచ్చుకోలు
  • భారత్‌కు ‘ఏ’ రేటింగ్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు
  • విద్య విషయంలో బహుశా ‘బీ’ రేటింగ్ ఇవ్వొచ్చని వ్యాఖ్య

దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించేందుకు భారత్ చేస్తున్న విశేష కృషిని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, దాతృత్వవాది బిల్ గేట్స్ ప్రశంసించారు. భారత్ చర్యలు చాలా ఆకట్టుకుంటున్నాయని, ఈ సమస్యను పారదోలేందుకు దృష్టిపెట్టినందుకు ‘ఏ’ రేటింగ్ ఇస్తున్నానని ఆయన అన్నారు. 

ఆదాయ స్థాయిని బట్టి పోషకాహార సూచీలలో ఆశించిన దానికంటే వెనుకబడి ఉన్నామని భారత్ ఒప్పుకుంటోందని, ఈ విధంగా నిజాన్ని అంగీకరించడం, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడం ఆకట్టుకునే విషయాలని తాను భావిస్తున్నట్టు బిల్ గేట్స్ చెప్పారు.

ఇతర దేశాల ప్రభుత్వాల కంటే భారత్ ఈ అంశంపై ఎక్కువ దృష్టి సారించిందని గేట్స్ మెచ్చుకున్నారు. మధ్యాహ్న భోజన విధానాలు, ప్రజా ఆహార విధానాల ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ప్రస్తావించారు. సమస్యను పరిష్కరించేందుకు భారత్‌కు ఇప్పటికీ గొప్ప అవకాశం ఉందని, భారత్ కు ఈ విషయంలో తాను 'ఏ' రేటింగ్ ఇవ్వడానికే ఇదే కారణమని పేర్కొన్నారు. 

గేట్స్ ఫౌండేషన్ ‘గోల్ కీపర్స్ రిపోర్ట్-2024’ ప్రారంభించిన సందర్భంగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. విద్య విషయంలో భారత్ తనకు తాను ‘బీ’ రేటింగ్ ఇచ్చుకుంటుందేమోనని భావిస్తున్నానని బిల్ గేట్స్ అన్నారు. మరింత మెరుగ్గా రాణించాలనే నిజమైన ఉద్దేశం భారత్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News