Lunar Eclipse: రేపు చంద్రగ్రహణం... ఆరోగ్యంపై నిజంగా ప్రభావం చూపిస్తుందా?

Lunar Eclipse 2024 on September 18 and how it affect health

  • చంద్రగ్రహణంపై ప్రజల్లో చాలా కాలంగా ఎన్నో నమ్మకాలు
  • మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని చాలామంది నమ్మకం
  • నమ్మకాలు ఎలా ఉన్నా... కొన్ని జాగ్రత్తలు ముఖ్యమంటున్న నిపుణులు  

వినీలాకాశంలో చోటుచేసుకునే ఖగోళ ఘట్టాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ అద్భుత ఖగోళ దృశ్యాలను వీక్షించేందుకు చాలా మంది ఔత్సాహికులు ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి రేపు (బుధవారం, సెప్టెంబర్ 18) చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. సూర్యుడి కాంతి చందమామ మీద పడకుండా భూమి అడ్డుగా వచ్చిన సదృశ్యంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

రేపు జరగనున్నచంద్రగ్రహణం ఈ ఏడాది రెండవది. అయితే చంద్రగ్రహణం మనుషుల ఆరోగ్యాన్ని నిజంగా ప్రభావితం చేస్తుందా? చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అనే సందేశాలు చాలామందిలో నెలకొని ఉంటాయి. చాలా కాలంగా ఎన్నో నమ్మకాలు బలపడి ఉన్నాయి.

జనాల్లో ఉండే నమ్మకాలు ఇవే...

చంద్ర గ్రహణాలు మనుషుల్లో భావోద్వేగాలను కలిగిస్తుంటాయని చాలా మంది భావిస్తుంటారు. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్ముతుంటారు. ఇక గ్రహణం ప్రభావంతో నిద్రలో ఇబ్బందులు ఎదురవుతుంటాయని, హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నమ్ముతుంటారు. 

అంతేకాదు ఋతు చక్రాలు, సంతానోత్పత్తిని కూడా చంద్రగ్రహణాలు ప్రభావితం చేస్తాయని చెబుతుంటారు. ఈ ప్రభావాల నివారణకు కొన్ని ఆయుర్వేద, సంప్రదాయ పద్దతులను జనాలను కూడా పాటిస్తుంటారు. 

వీటిని పాటించడం మంచిది...

అయితే, చంద్రగ్రహణం ప్రభావాలపై ఎవరి నమ్మకాలు ఎలా కొన్ని పద్దతులు పాటించడం ఆరోగ్యానికి మేలు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం, తాగునీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. నీళ్లు బాగా తాగాలని, మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసుకు ప్రశాంతతను ఇచ్చే ధ్యానం, యోగా చేయాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంతత కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు వంటి స్క్రీన్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. మొత్తంగా విశ్రాంతి, నిద్రకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News