Sim Cards: సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు... వివరాలు ఇవిగో!

buying airtel jio bsnl vi sim card rules changes
  • మొబైల్ సిమ్ కార్డు కొనుగోలు ఇక సులభతరం 
  • పేపర్ లెస్ వ్యవస్థను తీసుకువచ్చిన డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్
  • వినియోగదారుల వ్యక్తిగత పత్రాలతో మోసాన్ని నిరోధించడం కోసం ఈ చర్యలు
మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే నియమాలు సులభతరం అయ్యాయి. ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా ఫోన్, ఐడియా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ (డిఓటీ) ఇప్పుడు దీన్ని పూర్తిగా పేపర్ లెస్ గా మార్పు చేసింది. వినియోగదారులు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకున్నా లేక ఆపరేటర్‌ని మార్చాలని ఆలోచిస్తున్నా ఇకపై టెలికాం కంపెనీ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. 
 
డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుండి సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. వినియోగదారుల వ్యక్తిగత పత్రాలతో మోసాన్ని నిరోధించడంతో పాటు, డిజిటల్ ఇండియా కింద పూర్తిగా కాగిత రహిత వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల కోసం ఇ – కెవైసీ (నో యువర్ కస్టమర్) అలాగే సెల్ప్ కేవైసీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. 

వినియోగదారులు తమ నంబర్‌ను ప్రీపెయిడ్ నుండి పోస్టు పెయిడ్‌కి మార్చుకోవడానికి కూడా టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. వినియోగదారులు ఇప్పుడు ఓటీపీ అధారంగా సేవ ప్రయోజనాలను పొందవచ్చు. వన్ టైమ్ పాస్‌వర్డ్ తోనే ఎటువంటి ఫోటో కాపీ లేదా పత్రాన్ని భాగస్వామ్యం చేయకుండా కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ పూర్తి డిజిటల్ ప్రక్రియ వినియోగదారుల పత్రాల దుర్వినియోగాన్ని నివారిస్తుంది.
Sim Cards
Airtel
jio
telecom

More Telugu News