BSNL: జియో, ఎయిర్‌టెల్‌కు కూడా సాధ్యం కాని ప్లాన్‌ను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్!

BSNL new 54 day 4G plan offers more than just free calls

  • 54 రోజుల వ్యాలిడిటీతో రూ. 347 ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
  • 54 రోజుల వ్యాలిడిటీ.. 165 జీబీ డేటా.. గేమింగ్ సబ్‌స్క్రిప్షన్
  • త్వరలోనే అందుబాటులోకి 4జీ సేవలు

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ వైపు చూస్తున్నారు. చాలామంది యూజర్లు ఇప్పటికే బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు. 

తాజాగా జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా  బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయ ప్లాన్ ప్రకటించింది. రూ. 347తో ప్రకటించిన ఈ ప్లాన్‌లో యూజర్లకు 54 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరతో ఇలాంటి ప్లాన్‌ను ఇప్పటి వరకు ఏ సంస్థా ప్రకటించలేదు. 

 ఈ ప్లాన్‌లో వినియోగదారులు 54 రోజులపాటు అపరిమితంగా ఉచిత కాల్స్ పొందుతారు. అలాగే, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 3జీబీ డేటాతోపాటు అదనంగా 3 జీబీ డేటాతో కలిపి మొత్తంగా 165 జీబీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా హార్డీ గేమ్స్, చాలెంజర్ ఎరీనా గేమ్స్, గేమాన్, ఆస్ట్రోటెల్, గేమియం, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లిస్టిన్ పాడ్‌కాస్ట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వినియోగదారులకు త్వరలోనే సూపర్‌ఫాస్ట్ కనెక్టివిటీ 4జీ అందుబాటులోకి రానుంది. సంస్థ ఇప్పటికే తమ మొబైల్ టవర్లను అప్‌గ్రేడ్ చేస్తోంది. 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన వెంటనే 5జీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

More Telugu News