CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

cm revanth reddy will launch rajiv gandhi statue at secretariat today

  • సాయంత్రం 4 గంటలకు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం
  • పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీపా దాస్ మున్షి తదితరులు 
  • సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున నేతలు పాల్గొననున్నారు. 
 
వాస్తవానికి గత నెలలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని ప్రభుత్వం అనుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.  మరో పక్క సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తొలి నుండి బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తొంది.

అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సచివాలయం బయట కాదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. సచివాలయం లోపల ప్రధాన ద్వారం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటునకు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. దేశానికి ప్రధానులుగా చేసిన ఇందిరా గాంధీ, పీవీ నర్శింహారావుల విగ్రహాలు ఒక వైపు వరుసగా ఉండటంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అటు అమరవీరుల చిహ్నం సచివాలయం మధ్యలో ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News