Donald Trump: కమల, బైడెన్ లపై ఎవరూ హత్యాయత్నం చేయడంలేదేం?: మస్క్

Elon Musk Reaction After Trump Assassination Bid
--
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడంతో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. మాజీ అధ్యక్షుడిపైనే ఎప్పుడూ మర్డర్ అటెంప్ట్ జరుగుతోంది కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పైనా ఎవరూ కాల్పులు జరపడంలేదేమని సోషల్ మీడియా వేదికగా సందేహం వ్యక్తం చేశారు. 

ఈమేరకు ఆయన మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ యూజర్‌ చేసిన పోస్ట్‌ ను రీట్వీట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మరోమారు అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆయనతో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఆ ఇంటర్వ్యూ ప్రసారమయ్యే సమయంలో ట్విట్టర్ పై సైబర్ దాడి జరగడంతో చాలామంది ట్రంప్ అభిమానులకు అది చేరలేదు.
Donald Trump
Assassination attempt
Elon Musk
international
USA News

More Telugu News