Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వానికి డీజీపీ నివేదిక... ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు

DGP reportedly submitted report to AP Govt in Kadambari Jethwani issue

  • నటి కాదంబరి జెత్వానీపై వేధింపులు
  • ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు
  • సస్పెండ్ చేసిన సర్కారు

ముంబయి నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి డీజీపీ నివేదిక సమర్పించగా... ఇందులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్రపై అన్ని వివరాలను పొందుపరిచినట్టు తెలుస్తోంది. డీజీపీ నివేదికను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వం చర్యలకు తెరలేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది.

ఇప్పటికే జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్రపై ఏపీ ప్రభుత్వం డీవోపీటీకి సమాచారం అందించింది. ఏపీ హోంశాఖ సస్పెన్షన్ అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలపై సస్పెన్షన్ వేటు పడింది.

తాజాగా, డీజీపీ నివేదిక నేపథ్యంలో... ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

అక్రమ నిర్బంధం, వేధింపులపై కాదంబరి జెత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా... ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలిసింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో తనను అక్రమంగా నిర్వంధించారని... తన పూర్వాపరాలను, ముంబయిలో తన నివాసం, తదితర అంశాలను విశాల్ గున్నీ ద్వారా ఆరా తీయించారని... జెత్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News