Amrapali: జీహెచ్ఎంసీ పరిధిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ఆమ్రపాలి స్పందన

Amrapali reviews arrangement for Ganesh Maha Nimajjan in Greater Hyderabad

  • ఈ నెల 16,17 తేదీల్లో మహా నిమజ్జనం
  • ముస్తాబవుతున్న హైదరాబాద్
  • వివరాలు తెలిపిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి

మరో మూడ్రోజుల్లో హైదరాబాద్ లో గణేశ్ మహా నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఆమ్రపాలి వివరించారు. 

  • జీహెచ్ఎంసీ పరిధిలో 73 పాండ్స్, 5 పెద్ద చెరువుల వద్ద నిమజ్జన కేంద్రాల ఏర్పాటు
  • 73 పాండ్స్ లో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు
  • జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహుదూర్ పురా మీరాలం చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, కాప్రా ఊర చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు
  • అందుబాటులో 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 36 ట్రాన్స్ పోర్టు క్రేన్లు
  • 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ లు, 308 మొబైల్ టాయిలెట్స్, 52,270 టెంపరరీ వీధి లైట్లు ఏర్పాటు
  • నిమజ్జనం సందర్భంగా 160 గణేశ్ యాక్షన్ టీమ్స్ తో సేవలు
  • పలు చోట్ల అన్నపూర్ణ భోజన కేంద్రాల ఏర్పాటు
  • అన్ని నిమజ్జన కేంద్రాల వద్ద త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన
  • 24 గంటలూ అందుబాటులో అధికారులు
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమ్రపాలి చెప్పారు. ఇవాళ రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో కలిసి ఆమె నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగానే పై వివరాలు తెలిపారు.

  • Loading...

More Telugu News